లోక్ సభలో వైయస్సార్సీపీ ఎంపీల ఆందోళన

5 Aug, 2016 12:10 IST

న్యూఢిల్లీః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ ఎంపీలు లోక్ సభలో పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వరుసగా ఐదవరోజు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. హోదా ఇచ్చే వరకు పోరాటాన్ని విశ్రమించే ప్రసక్తే లేదన్నారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ  ఎంపీలు హోదా కోసం గట్టిగా పట్టుబడుతున్నారు.