కాపీ బాబు..
20 Nov, 2018 11:45 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్‌గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం’ అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ.. ఆయన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విజయసాయిరెడ్డి గతకొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.