రేపు రాజీనామాలు చేస్తాం
5 Apr, 2018 17:35 IST
– ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు
– హోదాపై మా పోరాటాన్ని చంద్రబాబు ఎగతాళి చేశారు
– ప్యాకేజీనే బెటరంటూ చంద్రబాబు హోదాను విస్మరించారు
– అవిశ్వాసం, రాజీనామాల ప్రకటనతో ఉద్యమం ఉధృతం
– ఢిల్లీలో చంద్రబాబు తీరు జుగుప్పాకరం
– అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు మా పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటించిన మేరకు ఈ నెల 6న ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పూటకో మాట మార్చుతూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు రోజులుగా ఢిల్లీలో చంద్రబాబు తీరు జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో వైయస్ఆర్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర విభజన సమయంలో నాడు మన్మోహన్సింగ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీ పదేళ్లు కావాలని కోరిందని గుర్తు చేశారు. అలాగే మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఏపీలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందన్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు తిరుపతి సభలో మోడీ పాల్గొన్న సభలో హామీ ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు.చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా గురించి చాలా గొప్పగా చెప్పారన్నారు. ఎన్నికలు పూరై్త, ఫలితాలు వచ్చిన తరువాత కొంత కాలం వరకు మౌనంగా ఉన్న చంద్రబాబు హోదా విషయంలో నోరు మెదపలేదన్నారు. ప్లానింగ్ కమిషన్‌వద్ద ఉన్న ఫైల్‌ను అమలు చేయాలని చంద్రబాబు కోరకపోవడంతో జాప్యం జరిగిందన్నారు.14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఏడాది తరువాత కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు స్వాగతించారన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని సామెతలు కూడా చెప్పారన్నారు. ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు.
వైయస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తుందన్నారు. హోదా విషయంలో ప్రజలను చైతన్యవంతం చే సేందుకు యువబేరీలు నిర్వహించారన్నారు. ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిశామన్నారు. ధర్నాలు, బంద్‌లు నిర్వహించామన్నారు. యువబేరి కార్యక్రమాలకు వెళ్తే పీడీ యాక్టులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారన్నారు. రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గొప్పలు చెప్పారన్నారు. ఏపీలో అబద్భుతాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రపంచంలోనే మేటి రాజధానిని నిర్మిస్తానని మభ్యపెట్టారన్నారు. ఇప్పటి వరకు పర్మి¯ð ంట్ బిల్డింగ్లు ఏమీ నిర్మించలేదన్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు.
పోలవరంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకొని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేశారన్నారు. ఇటీవల చంద్రబాబు మరోసారి స్వరం మార్చారన్నారు. ఆ రోజు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పింది ఇటీవల కూడా చెప్పారన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేవంటూ కేంద్రం నుంచి తన మంత్రులను రాజీనామా చేయించారన్నారు. ఆ రోజు నుంచి ప్రత్యేక హోదాపై మాట మార్చారన్నారు. ఇప్పుడు తప్పని సరిగా ప్రత్యేక హోదా కావాలని చెబుతున్నారన్నారు. ఫిబ్రవరిలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయస్ జగన్ సంచలన ప్రకటన చేశారన్నారు.
ప్రత్యేక హోదా కోసం మార్చి 1న కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తారని, 5న ఢిల్లీలో మహాధర్నా చేపడుతామని కార్యాచరణ ప్రకటించారన్నారు. అవిశ్వాస తీర్మానం విషయాన్ని కూడా వైయస్ జగన్ స్వీకరించారన్నారు. పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారని పసిగట్టి మార్చి 16నే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు మమ్మల్ని అవహేళన చేశారన్నారు. మరుసటి రోజు మేం మద్దతిస్తామన్నారు. ఆ తరువాత మేమే అవిశ్వాస తీర్మానం పెడతామని పూటకో మాట మార్చారన్నారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు వైయస్ఆర్సీపీ ఎంపీలు హోదా కోసం పోరాటం చేస్తారని, అప్పటికీ స్పందించకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తారని వైయస్ జగన్ ప్రకటించారన్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో అన్ని పార్టీల మద్దతు కోరామన్నారు. అందరూ కూడా మాకు మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు వల్లే అందరూ అవిశ్వాస తీర్మానాని మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం చేయించుకున్నారన్నారు. ఒక్క రోజు కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగలేదన్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలు చివరి రోజు అన్నారు. ఆ రోజు కూడా చర్చ జరపకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. సభ వాయిదా పడిన తరువాత మా రాజీనామాలు సమర్పించి అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోని అన్ని పార్టీలకు తెలియజెప్పేందుకే దీక్షలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నారు. పార్లమెంట్‌లోకి వెళ్తూ మెట్లకు నమస్కరించిన సందర్భం చూస్తే జుగుప్సాకరంగా ఉందన్నారు. చంద్రబాబు తీరుతో ఏపీ ప్రజలకు అవమానం జరిగిందన్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాపై నిందలు వేయడం అవివేకమన్నారు. నాడు వాజ్‌పేయితో స్నేహంగా ఉన్న చంద్రబాబు ఆయన్ను కూడా నిందించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో చంద్రబాబు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా తిరుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడటంతో చంద్రబాబు మోనగాడు అన్నారు. చంద్రబాబు వద్ద ఏమాత్రం విలువలు లేవని విమర్శించారు. తప్పనిసరిగా చంద్రబాబుకు ప్రజలు తగు గుణపాఠం చెబుతారని మేకపాటి హెచ్చరించారు.