వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల వాకౌట్
22 Mar, 2017 12:39 IST
ఏపీ అసెంబ్లీ: రైతు సమస్యలపై సభలో చర్చించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బుధవారం రైతు ఆత్మహత్యలు, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టినా ప్రభుత్వం పట్టించుకోకుండా చంద్రబాబు జల వనరులపై స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని నిరసించారు. రైతుల సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేసినా స్పీకర్ వినిపించుకోలేదు. కనీసం ఎందుకు వాకౌట్ చేస్తున్నామో చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.