బాలకృష్ణ మతి భ్రమించింది
20 Apr, 2018 14:17 IST
ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మతి బ్రమించి మాట్లాడుతున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
నిన్నటివరకూ పవన్ కల్యాణ్‌ను మోసిన ఎల్లో మీడియా ఇవాళ అతడిపై బురద జల్లుతోంది. చంద్రబాబు ఇచ్చే తాయిలాల కోసం ఎల్లోమీడియ రాష్ట్ర ప్రయోజనాలను మంటగలుపుతోందన్నారు. 25మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేదికాదు. చంద్రబాబు దీక్షను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నాలుగేళ్ల నుంచి హోదాను బతికించిన వైయస్ జగన్ వెంటే ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు.