అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలి
18 Dec, 2018 16:52 IST
నెల్లూరు: అగ్రిగోల్డు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండు చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్రిగోల్డు బాధితుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. అగ్రిగోల్డు ఆస్తులను మొత్తం ప్రభుత్వ అవసరాలకు స్వాధీనం చేసుకుని.. బాధితులకు తక్షణమే డిపాజిట్లు చెల్లించాలని, కాలయాపన చేకుండా చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఖాతాదారులతో పాటు 8 రాష్ట్రాలలో ఉన్న 32 లక్షల ఖాతాదారులు చెల్లించిన డిపాజిట్ల సొమ్మును అందరికీ తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు.