ఆదుకోవాల్సిన బాధ్యత లేదా..?
26 Nov, 2018 11:38 IST
తిత్లీ తుపాను బాధితులకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి
శ్రీకాకుళంః తిత్లీ తుపాన్ బాధితులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని పాలకొండ ఎమ్మెల్యే కళావతి అన్నారు.తుపాను బీభత్సంతో వరి,చెరకు,అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.నష్టపోయిన రైతులకు ఇప్పటి వరుకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదన్నారు. ఆదరణ పథకంలోనూ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు.జన్మభూమి కమిటీలు అవినీతి కమిటీలుగా మారిపోయాయన్నారు.రుణాలు మంజూరు చేయడంలో కూడా వివక్ష చూపుతున్నారన్నారు. పింఛన్లు కూడా సరిగ్గా అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.డ్వాక్రా మహిళలను కూడా చంద్రబాబు మోసం చేశారని, పసుపు–కుంకుమ అని చెప్పి నేటికి కూడా ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నారు.చంద్రబాబు పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలందరూ తరలివస్తున్నారన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో మా బతుకులు బాగుపడతాయని ప్రజలందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు.