కరువుపై ఏపీ ప్రభుత్వం తప్పుడు నివేదికలు
8 Dec, 2018 13:19 IST
హైదరాబాద్: రాష్ట్రంలో కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు నివేదికలు అందజేసిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోకుండా చంద్రబాబు వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరువే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు.