23న వైయస్‌ఆర్ సీఎల్పీ సమావేశం
21 Oct, 2017 14:46 IST
హైదరాబాద్
: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన వైయస్‌ఆర్ సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై వైయస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.