వైయస్సార్‌సీపీ నాయకుల శ్రమదానం

12 Jun, 2017 17:59 IST
విద్యానగర్‌(గుంతకల్లు టౌన్): పట్టణంలోని పోర్టర్స్‌లైన్‌ విద్యానగర్‌లో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేశారు. విద్యానగర్‌ రోడ్డు నందు ఏర్పడిన గుంతల వల్ల పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా వర్షం వచ్చినప్పుడు నీరంతా నిల్వ ఉంటూ దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వార్డుకి చెందిన వైయస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు మౌలా, తన్వీర్, అంజి, సమీర్, దావుద్‌లు రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టిని తెప్పించిన ఆ గుంతలను పూడ్చివేశారు. వీరితో పాటు కాలనీకి చెందిన పలువురు యువకులు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను సేవలను అభినందించారు.