జెర్రిపోతులపాలెం ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
4 Jan, 2018 15:47 IST
విశాఖ: జెర్రిపోతులపాలెంలో దళిత మహిళపై దాడి ఘటనపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన కొడుకు, అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన కమిషన్ సభ్యులు విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.