సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
15 May, 2017 15:28 IST
వైయస్ఆర్ జిల్లా: కడపలోని 39వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు మసిమ బాబు, డివిజన్ ఇన్‌చార్జ్ మున్నా, మహిళా కన్వినర్ తెలుగుపులి వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.