వివాహ వేడుకల్లో వైయస్ఆర్‌సీపీ నేతలు
3 Apr, 2017 18:18 IST
చిలకలూరిపేట : పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకల్లో జిల్లాకు చెందిన వైయస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు. స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో జరిగిన పీసిసి కార్యదర్శి గోవిందు శంకర శ్రీనివాసన్ కుమార్తె ప్రత్యూష వివాహమహోత్సవంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అ«ధ్యక్షుడు మర్రి రాజశేఖర్,వినుకొండ,గురజాల నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల వివాహం చేసుకున్న వైయస్ఆర్ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల శ్రీకాంత్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబటితో పాటు పార్టీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాదులు విడదల హరనాథబాబు, బైరా వెంకట కృష్ణారావులు పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు.