ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వ కుట్ర

9 Jun, 2018 15:17 IST
రాజమండ్రి: వైయస్‌ జగన్‌ పాదయాత్రకు గోదావరి బ్రిడ్జీపై అనుమతి నిరాకరించడం ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రౌతు సూర్యప్రకాశ్‌ పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్‌ వద్ద కూడా బహిరంగ సభ జరపవద్దని పోలీసులు సూచించడం దారుణమన్నారు. డీఎస్పీ నిర్ణయంపై ఎస్పీకి వివరించామన్నారు. ప్రజల్లో భయందోళన కలిగేలా పోలీసులు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. గోదావరి బ్రిడ్జీపై ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేవన్నారు. గతంలో వైయస్‌ జగన్‌ ఎక్కడ పాదయాత్ర చేసినా నిరాకరించలేదన్నారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకే నోటీసులు ఇచ్చారని చెప్పారు. గోదావరి బ్రిడ్జిపైనే పాదయాత్ర కొనసాగుతుందని రౌతు సూర్యప్రకాశ్‌ తెలిపారు.