ఏపీలో హిట్లర్ పాలన
23 Nov, 2018 16:50 IST
- భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారు
– సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు
– వైయస్ఆర్సీపీ నాయకులు మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైయస్ఆర్సీపీ మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వాలంటీర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. పోలీస్ యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయిందని మండిపడ్డారు. చట్ట బద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. టీడీపీ ఆదేశాల మేరకు పనిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అసలు సంబంధం లేని పనులతో అమాయకులను వేధిస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛను పోలీసులు ఆటంకం కల్గించవద్దని వారు విన్నవించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతల చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీకి విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు.