ఫిరాయింపు నేతకు ప్రజలు బుద్ధిచెబుతారు..
20 Oct, 2018 12:07 IST
విజయనగరంః అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించిన బొబ్బిలి రాజులకు రాబోయే ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాస్ అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసగించిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. బొబ్బిలిలో వైయస్ జగన్ బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందన చూస్తే టీడీపీపై ప్రజలు వ్యతిరేకిత ఎంత తీవ్రంగా ఉందో తేటతెల్లమవుతుందన్నారు. బొబ్బిలిలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.