అది టీటీడీ కాదు..టీడీపీ పాలక కమిటీ
25 Jun, 2018 15:49 IST
హైదరాబాద్: తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న పాలక కమిటీ టీడీపీ పార్టీ కమిటీలా మారిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. నగల లెక్కింపులో న్యాయ జరగదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల భూములను సైతం కాజేసిన వారు పరిశీలన కమిటీలో ఉన్నారని..ఇది శ్రీవారికే అవమానమని పేర్కొన్నారు. కేరళలో పద్మనాభస్వామి ఆలయంలో వేసిన జ్యూడిషియల్ కమిటీలా ఇక్కడ నగల పరిశీలన కమిటీ వేస్తే తప్ప..న్యాయం జరగదన్నారు.