చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయి..
31 Oct, 2018 11:48 IST
వైయస్‌ఆర్‌సీపీ నేత కోటగిరి శ్రీధర్
పశ్చిమగోదావరిః ఇసుక,మట్టి అక్రమ రవాణాలో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కోటగిరి శ్రీధర్, అబ్బాయి చౌదరిలు ఆరోపించారు. రోజురోజుకు నియోజకవర్గంలో చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ప్రజలందరి ఆత్మరక్షణ కోల్పోయి జీవిస్తున్నారన్నారు. అధికారులు అని చూడకుండా చింతమనేని రెచ్చిపోతున్నారని, తాజాగా కొప్పాకలోని పోలవరం కుడికాల్వ నుంచి మట్టి తరలింపును అడ్డుకున్న విజిలెన్స్ అధికారులపై చింతమనేని దౌర్జన్యానికి పాల్పడటం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో చింతమనేనికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి ప్రెస్‌మీట్లు పెట్టడం కాదని, దెందులూరు నియోజకవర్గంలో ఎంత అరాచకం జరుగుతుందో దృష్టి పెట్టాలన్నారు.