బాబు పాలనకు కౌంట్‌డౌన్ మొదలైంది...
16 Nov, 2018 15:24 IST
కాకినాడః బాబు పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని ఆయనకే అర్థమైందని వైయస్‌ఆర్‌సీపీ నేత కన్నబాబు అన్నారు. దొంగలను పట్టుకోకుండా వాళ్లతోనే కలిసేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉందని అన్నారు.చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ అవసరమొచ్చిందని, జగన్‌పై కుట్ర పన్ని కేసులు వేసేందుకు చంద్రబాబు సీబీఐని వాడుకున్నారన్నారు. తన దగ్గరికి వచ్చే సరికి సీబీఐ అవసరం లేకుండా పోయిందా అని ప్రశ్నించారు.