రాష్ట్రమంతా వైయస్ జగన్ వైపు...
14 Nov, 2018 11:32 IST
విజయనగరంః రాష్ట్రమంతా జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వైపు చూస్తుందని వైయస్‌ఆర్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు అన్నారు. వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాSన్ని తలుచుకుని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పేదల కష్టాలను తీర్చే జననేతను అంతం చేయాలని చేసిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు.వైయస్ జగన్‌ను మహిళల నుంచి భారీసంఖ్యలో ఆదరణ లభిస్తుందన్నారు. సీతానగరం పాత బ్రిడ్జికి కనీసం టెండర్లు కూడా వేయలేని పరిస్థితి వుందన్నారు.ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంఛ అయిన జంఝవతి సాగునీరు,తోటపల్లి, వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్లు, సీతానగరం పరిధిలో సుమారు 11 కోట్ల 30 లక్షలు చెరకు బకాయిలు చెల్లించాలన్నారు. సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకురావడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారన్నారు.