ప్రసన్న కుమార్‌రెడ్డి దాతృత్వం
2 Feb, 2017 20:02 IST
కోవూరు: వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వికలాంగ మహిళకు ట్రై సైకిల్ అందజేశారు. ఇటీవల మండలంలోని వేగూరు కండ్రిగ ప్రాంతంలో గడప గడపకూ వైయస్‌ఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన వికలాంగ మహిళ పారి శేషమ్మ ప్రసన్నకుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి తనకు వికలాంగులకు ఉపయోగపడే ట్రై సైకిల్ కావాలని కోరింది. ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామ సర్పంచి దేవేంద్రమ్మ సమక్షంలో శేషమ్మకు ట్రై సైకిల్‌ను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు