వైయస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం
6 Dec, 2018 16:18 IST
శ్రీకాకుళం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇద్దామని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. చిలకపాలెంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సమర్ధవంతమైన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలిచి అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అలాంటి మహానేత కుమారుడు వైయస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ అతి త్వరలోనే ముఖ్యమంత్రి అవుతున్నారని, నవరత్నాలతో ప్రతి ఇంటికి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుడం అంతే నిజమన్నారు. ఎవరు ఆపలేరన్నారు. మన నాయకుడికి ప్రతి జిల్లాలో నిరాజనాలు పట్టారన్నారు. చెయ్యి చెయ్యి కలిపి, అడుగులో అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. రూ.6 వేల కోట్ల కుంభకోణంలో ఉన్న వ్యక్తి సుజనా చౌదరిని చంద్రబాబు కేంద్ర మంత్రిని చేశారన్నారు. చంద్రబాబు బీసీలను విస్మరించారన్నారు. వైయస్ జగన్‌కు అండగా ఉందామని, వైశ్యామ్యాలను పక్కన పెట్టి జగన్‌ను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు.