వాస్తవాలను ఛేదించాలి..
1 Nov, 2018 13:05 IST
టీడీపీ ప్రభుత్వం తీరుపై పలు అనుమానాలు
వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు.
హైదరాబాద్ః ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నంపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజ్‌భవన్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రజలకు తెలియకుండా టీడీపీ ప్రయత్నాలు చేసిందన్నారు. ఏపీ డీజీపీ సంఘటన జరిగిన అరగంటలోనే ఇది వైయస్ జగన్ అభిమానే చేసినట్లు చిత్రీకరించడం, చంద్రబాబు, మంత్రుల బృందం సంఘటనపై వితండ వాదం చేసి వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా ప్రయత్నాలు చేశారన్నారు. నిజాలను ఛేదించడానికి వాస్తవ విచారణ జరగడం లేదన్నారు. రాష్ట్ర గవర్నర్ హత్యాయత్నం గురించి తెలుసుకోనే ప్రయత్నం చేస్తే చంద్రబాబు ఆ ప్రయత్నాన్ని తప్పుబట్టారన్నారు. చంద్రబాబు ప్రవర్తన, డీజీపీ చర్యలు, మంత్రుల వ్యాఖ్యలు దారుణమన్నారు. సీఎం,డీజీపీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. థర్డ్‌పార్టీ విచారణ కోరినట్లు తెలిపారు. సాధారణ వ్యక్తిని చూపించి హత్యాయత్నం చేశాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, దీని వెనుక కుట్రదారులు ఎవరో అన్న సంగతి తేల్చాలన్నారు.