భూస్వామ్య, నిరంకుశ పోకడలు మానుకోండి
2 Oct, 2018 12:14 IST
- బహిరంగ సభకు ఆటంకాలు కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు
- వెల్లువెత్తిన జనసముద్రమే అధికార పార్టీ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనం
విజయనగరం: టీడీపీ నేతలు భూస్వామ్య, నిరంకుశ పోకడలు మానుకోవాలని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి హితవుపలికారు. అధికార తెలుగుదేశం పార్టీ నిన్నటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఆటంకాలు కలిగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు వెల్లువెత్తిన జనసముద్రమే అధికార పార్టీ మీద ఉన్న ఆగ్రహానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని నిన్నటి సభ ద్వారా ప్రజలే తిప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం, బహిరంగ సభకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ద్వారా వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని అధికార పార్టీ నేతలు చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ రకమైన చర్యలు వారి భూస్వామ్య, నిరంకుశ పోకడలకు నిదర్శమన్నారు.ఇలాంటి చర్యలు మానుకోకపోతే టీడీపీ నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.