వైయస్‌ జగన్‌ను విమర్శించేందుకేనా సీఎం సభలు?

2 Aug, 2018 13:19 IST

తిరుపతి: చంద్రబాబు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేశారని, ఇప్పుడు వైయస్‌ జగన్‌పై అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విమర్శించేందుకేనా చంద్రబాబు సభలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూస్తే వణికి చచ్చే చంద్రబాబు తన రాజకీయ అనుభవం అంతా వయసు ఉన్న వైయస్‌ జగన్‌ను చూస్తే అంత కంటే ఎక్కువగా వెన్నులో దడ పుట్టి వణికి బేజారెత్తుతున్నారని పేర్కొన్నారు.