స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలి
13 Nov, 2018 11:04 IST
సిట్ దర్యాప్తుపై అనుమానాలు..
వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
విజయనగరంః బీసీఏఎస్ నివేదికతో వైయస్ జగన్ హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందన్న విషయం మరోసారి బట్టబయలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు అక్టోబర్ నెలకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉందన్న అంశం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇటువంటి అంశాలను సిట్ ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తుపై ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.కేసును నీరుగార్చే యత్నం ప్రభుత్వం చేస్తోందని మేం మొదట నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. బీసీఏఎస్ నివేదిక మా ఆందోళనను నిజం చేసేలా ఉందన్నారు. సిట్ దర్యాప్తు ప్రభుత్వ కనుసన్నల్లో కొనసాగుతుందన్నారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.