టీడీపీ పాలనలో లక్షల కోట్ల అవినీతి...
6 Oct, 2018 12:33 IST
ఐటిదాడులతో చంద్రబాబు అండ్ కో వణుకు..
విజయనగరంః చంద్రబాబు అండ్ కో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని
ఐటిదాడులతో ఆ దోపిడీ బయటపడుతుందని టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.. చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందడానికి కేంద్రం చేయిస్తున్న దాడి అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ నాలుగున్నర ఏళ్లతలో చంద్రబాబుకు చెందిన తాబేదారులు, తొత్తులు విపరితమైన అక్రమార్జునకు పాల్పడ్డారని ఆరోపించారు. ఐటిదాడులను తన మీద జరుగుతున్న దాడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు తీరు సిగ్గుచేటన్నారు. ఐటి అధికారులకు రక్షణ కల్పించలేమని చెప్పుతూ పరోక్షంగా ఐటి అధికారులపై బెదిరింపు ధోరణులకు దిగుతున్నారన్నారని ఆరోపించారు.లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. వైయస్ జగన్‌పై దాడులు జరిగినప్పడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు..నేడు అక్రమార్జనకు పాల్పడిన తన అనుచరగణానికి వత్తాసు పలకడం దారుణమన్నారు.