రాజీనామాల ఆమోదానికి కోర్టును ఆశ్రయిస్తాం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎం.పి. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వం రాజీనామా ఆమోదం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. శ్రీ జగన్‌తో పాటు సహచర ఎం.పి.లు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తిరస్కరించటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీ వైయస్ జగన్ స్పీకర్ ఫార్మాట్‌లో పంపిన రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ఫోన్ సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డితో పాటు, పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన ఎస్.పి.వై.రెడ్డి రాజీనామాలను ఆమోదింపచేసుకునే దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.