రాయలసీమపై చంద్రబాబు వివక్ష
27 Aug, 2018 15:07 IST
తాగు, సాగునీరు అందించకుండా కుట్ర
బీమా పరిహారం రైతులకు వెంటనే అందించాలి
వైయస్‌ఆర్ సీపీ మాజీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి డిమాండ్
వైయస్‌ఆర్ జిల్లా: రాయలసీమకు సాగునీరు అందించడంలో చంద్రబాబు సర్కార్ వివక్ష చూపుతోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీమ మొత్తం కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న పంట బీమాను రైతులకు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన కరువుపై పోరు మహాధర్నా కార్యక్రమానికి మాజీ ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 2014 రబీకి సంబంధించి వేముల, కొండాపురం, ముద్దనూరు మండలాల్లో రూ. 13.69 కోట్ల బీమా మంజూరైందన్నారు. నాన్‌లోనింగ్ ఫార్మర్స్‌కు ఇవాల్టీకి కూడా బీమా రాలేదని, ఇదేంటని ఏఐసీ ఆఫీస్‌కు వెళ్తే 2014 రబీకి సంబంధించి రూ. 13.50 కోట్లు కావాలని చెప్పారన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ. ఐదున్నర కోట్లు ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశాం. మళ్లీ జూన్ 2018లో లేఖరాసినా పట్టించుకోవడం లేదని చెప్పారన్నారు. పెండింగ్‌లో ఉన్న 2012, 2014 శనగ పంట బీమా వెంటనే రైతులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2015కు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటికీ గతలేదన్నారు. పెండింగ్ ఇన్సూరెన్స్‌లు, ఇన్‌పుట్ సబ్సిడీలు, ప్రధానమంత్రి ఫజల్ బీమా కింద పరిహారం వెంటనే అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు.