హోదా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
30 Nov, 2018 16:04 IST
కాకినాడః క్రమశిక్షణకు మారుపేరు వైయస్‌ఆర్‌సీపీ అని సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను అన్నారు.ప్రజలకు అండగా చిత్తశుద్ధితో వైయస్ జగన్ పోరాడతున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తృణపాయం పదవులను వదులుకున్నారన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరుకు తీసుకెళ్ళిన ఏకైక నాయకుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి హోదా తీసుకురావడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు అవినీతి పాలనపై ప్రజలందరూ ఆలోచించాలన్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాజధాని భూములు పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. జనసేన అ«ధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఆవేశం ఎక్కువ..ఆలోచన తక్కువ అని విమర్శించారు. విజన్ లేని నాయకుడు అని,టీడీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై ఏం ప్రశ్నిస్తున్నావంటూ పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు.