తాగునీటి కోసం వైయస్‌ఆర్ సీపీ ధర్నా
22 May, 2017 14:25 IST
చిత్తూరు: గూడలవారిపాలెంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వరదయ్యపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్ సీపీ ధర్నాకు దిగింది. పార్టీ నేత కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఖాళీ బిందెలతో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే విషయం కూడా టీడీపీ సర్కార్‌కు, అధికారులకు తెలియదా అని ఆదిమూలం ప్రశ్నించారు. అనంతరం నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.