ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులా?
3 Apr, 2017 12:51 IST
ప్రకాశం: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. జంపింగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం పట్ల ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరు పట్టణంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు.