మొగల్తూరు ఆక్వా ఘటనపై వాయిదా తీర్మానం
31 Mar, 2017 09:49 IST
ఏపీ అసెంబ్లీ: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆక్వా ఘటనపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ ఈ తీర్మానాన్ని పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించడంతో ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో యధావిధిగా మంత్రులు, టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చి ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణకు తెర లేపారు.