'స్థానికం'లో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌కే గెలుపు
2 Jul, 2013 17:14 IST
ఏలూరు, 2 జూలై 2013:
రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని పోలవరం ఎమ్మెల్యే, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు. కాంగ్రెస్, టిడిపిలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు తమ పార్టీ వైపే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పశ్చిమ గోదావరి జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బాలరాజు మాట్లాడారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో బాలరాజుతో పాటు, ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌కుమార్, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు పాల్గొన్నారు.