వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
5 Sep, 2012 05:13 IST
విజయనగరం, 5 సెప్టెంబర్ 2012 : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో భారీ సంఖ్యలో నేతలు పార్టీలో చేరారు. సీతానగరం మండలం నుంచి 15 మంది మాజీ ఎంపీటీసీలు, 32 మంది సర్పంచ్లు, 43 గ్రామాల నుంచి ఐదు వేల మంది వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జి రవిబాబు, వైయస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడఉ పెన్మత్స సాంబశివరాజు, యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ హాజరయ్యారు.