రేపు వైయస్ విజయమ్మ మీడియా సమావేశం
10 Nov, 2018 16:21 IST
అమరావతి : విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇంతవరకు వైయస్ జగన్ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. కాగా ఈ ఘటనపై తొలిసారిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, వైయస్ జగన్ తల్లి విజయమ్మ స్పందించనున్నారు. వైయస్ జగన్‌పై హత్యాయత్న ఘటనపై ఆదివారం ఉదయం 11 గంటలకు వైయస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతారని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సాలూరు నుంచి పునఃప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ జననేత వైయస్ జగన్ 294 రోజులుపాటు పాదయాత్ర చేశారు.