రెండోరోజు కొనసాగుతున్న వైఎస్ జగన్ సమర దీక్ష

4 Jun, 2015 14:15 IST
మంగళగిరి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజు కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మోసాలను చాటి చెప్పడానికి ఆయన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.  బాబు ఏడాది పాలనలో జరిగిన మోసాలను తూర్పారబడుతూ వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు అశేష జనవాహిని కదలి వస్తోంది.

యువకులు, మహిళలు, వయోవృద్ధులు సైతం మండుటెండలను లెక్క చేయకుండా సమరదీక్షకు పెద్ద సంఖ్యలో తరలి  వస్తున్నారు. వైఎస్ జగన్ దీక్ష గురువారం సాయంత్రం అయిదు గంటల వరకూ దీక్ష కొనసాగిస్తారు.