వైఎస్ జగన్ దీక్ష వాయిదా..

25 Sep, 2015 17:00 IST
ప్రత్యేకహోదాకు చంద్రబాబే అడ్డుః పెద్దిరెడ్డి

హైదరాబాద్ః చంద్రబాబు కుట్రలు, కుతంత్రాల కారణంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 26న చేపట్టనున్ననిరవధిక నిరాహార  దీక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది. 

సోమవారం హైకోర్టుకు..!
వైఎస్ జగన్ దీక్షకు రాష్ట్రప్రభుత్వం అనుమతిచ్చేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా...హైకోర్టు రెగ్యులర్ పద్ధతిలోరావాలని సూచించింది.ఈనేపథ్యంలోనే సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని పెద్ది రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దీక్ష వాయిదా వేస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

చంద్రబాబుకు జగన్ ఫోబియా..!
పోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు వైఎస్ జగన్ దీక్షను అడ్డుకోవడం దురదృష్టకరమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ దీక్ష అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని అన్నారు. ప్రత్యేకహోదాకు చంద్రబాబే పెద్ద అడ్డని పెద్దిరెడ్డి విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు తావత్రయ పడుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు రెండసార్లు దీక్ష చేయలేదా అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టింటినా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా కోసం పోరాడుతారని ప్రకటించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.