అడుగడుగునా వైయ‌స్ జగన్ కు ఘన స్వాగతం

27 May, 2016 10:47 IST

విజయవాడ:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో  పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంత‌రం అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ మీదుగా బయల్దేరారు. మార్గ మధ్యలో అనేక చోట్ల పార్టీ శ్రేణులు వైయస్ జగన్ ను పలకరించాయి. ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికాయి. .