అఖిలప్రియకు వైయస్ జగన్, విజయమ్మ పరామర్శ
12 Mar, 2017 14:35 IST
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వారు ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు.