జన ప్రభంజనం మధ్య విగ్రహావిష్కరణ

27 Jan, 2016 18:16 IST
కాకినాడ: ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు భారీ స్పందన లభించింది. మధురపూడి విమానాశ్రయంలో దిగి కాకినాడ వెళ్లే సమయంలో అడుగడుగునా ప్రజలు ఆపుతూ పలకరించేందుకు ప్రయత్నించారు. సామర్లకోట దాటాక మాధవపట్నం దగ్గర దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.