బాబూ..మీ అసమర్ధ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు
26 May, 2018 12:47 IST
పశ్చిమ గోదావరి: చంద్రబాబూ..మీ అసమర్ధ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని వైయస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో అత్యాచార ఘటనలను ఖండిస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. మీ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ భద్రంగా లేదని స్పష్టమైందని వైయస్ జగన్ అన్నారు. చిత్తూరులో బాలికపై అత్యాచార ఘటన ఆగ్రహం కలిగిస్తోందన్నారు. గడిచిన నెలలో నాలుగు అత్యాచార ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.