నేడు జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
22 Nov, 2016 10:59 IST
తూర్పుగోదావరి జిల్లాః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. తొండంగి మండలం దానవాయిపేట గ్రామాన్ని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శిస్తారు. దివీస్ పరిశ్రమ స్థాపన వల్ల నష్టపోనున్న బాధిత ప్రజలతో మధ్యాహ్నం తర్వాత ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో వారినుద్దేశించి ప్రసంగిస్తారు.