సీపీఎం కార్యదర్శి మధుకు వైయస్ జగన్ ఫోన్
2 Oct, 2016 14:04 IST
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఫోన్ లో మాట్లాడారు. శనివారం భీమవరంలో జరిగిన పరిణామాలపై వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధుతో పాటు సీపీఎం కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై వైయస్ జగన్ ఆక్షేపించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు శనివారం భీమవరం వెళ్లిన మధుతో పాటు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.