సీతారాం ఏచూరిని కలుసుకున్న వైయస్ జగన్ బృందం
9 Aug, 2016 12:50 IST
హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బృందం న్యూఢిల్లీలో సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలుసుకుంది. ఏపీకి ప్రత్యేకహోదాకు సంబంధించిన అంశంపై ఆయనతో చర్చించారు. పార్టీ ఎంపీలు, ఇతర నేతలతో కలిసి వైయస్ జగన్ వరుసగా జాతీయ నేతలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేకహోదాను సాధించడంలో టీడీపీ పూర్తిగా విఫలమవ్వడంతో ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్సీపీ హోదా కోసం ఎనలేని పోరాటాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక ధర్నాలు, దీక్షలు, నిరసనలు, యువభేరి కార్యక్రమాల ద్వారా వైయస్ జగన్ హోదా ఆకాంక్షను తెలియజెప్పారు. టీడీపీ, బీజేపీల మోసపూరిత వైఖరికి నిరసనగా రాష్ట్రానికి హోదాను సాధించుకునేందుకు అన్ని పార్టీల నేతలను కలుపుకొని పోతూ ఉద్యమవేడిని మరింత పెంచారు.