నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
19 May, 2017 08:40 IST
శ్రీకాకుళంః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేచి నుంచి రెండ్రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలుసుకుని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు.