పార్టీ నాయకుల కృషి, ప్రజల ఆదరణతో: వైయస్ జగన్

14 Jun, 2016 11:09 IST

విజయవాడః ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.....ఐదేళ్లుగా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాం. వైయస్సార్ కాంగ్రెస్  పార్టీ తొలుత అమ్మ, నాతో మొదలైంది. ఆతర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ 18, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది పార్లమెంట్ సభ్యులతో రాష్ట్రంలో 45 శాతం ఓట్లతో కోటి 30 లక్షల మంది ప్రజల ఆదరణతో పార్టీ నిలబడి ఉంది. చంద్రబాబు పాలన మనకొద్దు అని ప్రజలు కోరుతున్న పరిస్థితుల మధ్య మనమంతా ఏకమై.... పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు ఏవిధంగా అండగా ఉండాలన్న దానిపై ప్రజల గొంతుకగా కలిసికట్టుగా ముందుకెళ్దామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.