పెనుగంచిప్రోలుకు వైయస్ జగన్..బస్సు ప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి
28 Feb, 2017 11:07 IST
హైదరాబాద్ః కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్ర్భాంతి చెందారు. హుటాహుటిన పెనుగంచిప్రోలుకు బయలుదేరారు. బస్సు ప్రమాద ఘటన స్థలిని పరిశీలించి క్షతగాత్రులను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. కాగా, దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.