మిర్చీ యార్డు సమీపంలో వైయస్ జగన్ రైతు దీక్ష
27 Apr, 2017 10:58 IST
గుంటూరు: పంటలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరు వేదికగా చేపట్టనున్న రైతు దీక్ష వేదిక ఖరారైంది. నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలోని ఒక ప్రైవేటు స్థలాన్ని పార్టీ నేతలు దీక్షా ప్రాంగణంగా నిర్ణయించి, ఏర్పాట్లను పరిశీలించారు.