పులివెందులలో పర్యటిస్తున్న వైయస్ జగన్
13 Apr, 2017 13:03 IST
కడప: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన పులివెందులలో కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఆయన ఉదయం లింగాల మండలంలో మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో వైయస్ జగన్.. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రజా సమస్యలపై చర్చించారు. రెండురోజుల పాటు వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.